సంచారమే ఎంతో బాగున్నది
- krishna mohan
- Oct 22, 2022
- 1 min read
Updated: Nov 10, 2022
- గోరేటి వెంకన్న
సంచారమే ఎంతో బాగున్నది
దీన్నంత ఆనంద ఏమున్నది
ఇల్లు పొల్లు లేని
ముల్లె మూట లేని
వెంబడించే వెర్రి జ్ఞాపకాలు లేని
సంచారమే
గాన సంచారమే
జ్ఞాన సంచారమే
సంచారమే లోన సంచారమే
ఆ సంచారమే ఎంతో బాగున్నది
సేదతీర చెరువు కట్ట ఉన్నది.
నీడ కోసం చింత చెట్టున్నది
జోలలు ఊపే గాలి పిట్టున్నది.
గుర్తు లేని గుడ్డి నిదురున్నది.
బరువు దిగిన గుండె బలే వున్నది.
సంచారమే
సిప్పోలే మోదుగ దొప్పున్నది.
చిటారు కొమ్మన తేనేపట్టున్నది.
జోపితే జోరైన తీపున్నది.
రూపులేని ఆకలి చూపున్నది.
ఆకలి అంత అదృష్టం ఏమున్నది
సంచారమే ఎంత బాగున్నది.
కిరీటమేమో బారమేమున్నది.
దాన్ని కిందేసితే బరువు లేకున్నది.
చెప్పులు తెగిపోయిన మేలున్నది.
ముళ్ళ తుప్పలేవో తెలిసిపోతున్నది.
కాలి మట్టి కేదో మహిమ ఉన్నది.
తేళ్లు పురుగులు తొలగి పోతున్నవి.
సంచారమే ఎంతో బాగున్నది.
సగనారే... ఓ…
పండు పండిన జాన పండ్లున్నవి.
తెంపుకుంటే నోటికింపున్నది.
సేదు గింజల్లేవో దాగున్నది.
నమిలే కొద్దీ తీపినిస్తున్నవి.
దారి బత్తెం.
దారి బత్తెమ్ కరువు లేకున్నది.
రాలిపడ్డవి రాశులగనున్నవి.
ఊరి ఊరికి దారులేరున్నవి.
ఊటలోలే బాటలోస్తున్నవి.
బాట పక్కన వింత పూలున్నవి.
తోవ ఎంత నడిచిన విసుగు లేకున్నది.
గాలి గంధామోలే వస్తున్నది.
గాలి గంధామయి వస్తున్నది.
ఖాళీగుంటే కడుపు నింపుతున్నది.
సంచారమే
Comments